మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథ కాలనీలోని రోడ్ నంబర్ 6/C దగ్గర వేప వృక్షం పూర్తిగా ఎండిపోయి ఉందనీ కాలనీవాసులు తెలిపారు. చెట్టు కొమ్మల మధ్య నుంచి విద్యుత్ తీగలు ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెట్టు అమాంతం కింద పడితే విద్యుత్ తీగలు తెగిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి ఎండిపోయిన వేప వృక్షాన్ని వెంటనే తొలగించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.