మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర మండలం గుదిబండలో ఓ వ్యక్తి భార్య, అత్తపై కత్తితో దాడి చేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన భార్యను కాపురానికి పంపడంలేదని ఆగ్రహంతో భార్య, అత్తపై కత్తితో దాడి పాల్పడ్డాడు. ఈ దాడిలో అత్తకు తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమం మారింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.