మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం అమ్మాపురం గుట్టల్లో వెలసిన కురుమూర్తి స్వామి గుట్ట చుట్టూ భక్తులు శనివారం గిరి ప్రదర్శన చేపట్టారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కురుమూర్తి స్వామిని దర్శించుకుని గిరి ప్రదర్శన ప్రారంభించారు. గుట్ట చుట్టూ నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదర్శన ఉంటుందని పరిషత్ నాయకులు కృష్ణమూర్తి భాస్కర్ తెలిపారు.