సీఎం రేవంత్ రెడ్డికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతులు పండించిన ధాన్యం కొనడంపై లేదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. కురుమూర్తి స్వామి దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ. ధాన్యం కొనుగోలు చేయకపోతే అధికారులను అడగడం లేదని, మద్యంపై గతంలో కంటే రూ. 10వేల కోట్ల ఆదాయం అధికంగా రావాలని ఎక్సైజ్ అధికారులను సీఎం ఆదేశిస్తున్నారన్నారు. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా సీఎం మార్చారని ఆరోపించారు.