యూపీలో ఓ గోనె సంచిలో దళిత యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. మెయిన్‌పురి జిల్లాలోని కర్హల్ నియోజకవర్గంలో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చినందుకు అత్యాచారానికి పాల్పడి చంపినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ప్రశాంత్ యాదవ్, మోహన్ కతేరియాను అరెస్ట్ చేసినట్లు మెయిన్‌పురి జిల్లా ఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.