మహబూబ్ నగర్ జిల్లాలో కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం శుక్రవారం సాయంత్రం కన్నుల పండువగా సాగింది. శివసత్తులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అశేష ప్రజావాహిని మధ్య ఊరేగింపుగా ఉద్ధాలు కురుమార్తి ఆలయానికి చేరాయి. కురుమూర్తి ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. ఎమ్మెల్యేలు మధుసూదన్ రెడ్డి, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సీతమ్మ, భక్తులు పాల్గొన్నారు.