కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు

83చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మంగళవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఉద్యోగస్తులతో కలిసి బతుకమ్మను పాటకు నృత్యం చేశారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు గుర్తింపు ఐనా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్