కొత్తకోట: శ్రీలలితాదేవిగా జ్ఞానాంబిక మాత దర్శనం

57చూసినవారు
దేవరకద్ర నియోజకవర్గం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి శ్రీకోటి లింగేశ్వర దత్త దేవస్థానంలో ఆరవరోజు మంగళవారం శ్రీలలితా దేవిగా జ్ఞానాంబిక దేవి భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు జ్ఞానాంబికా దేవిని శ్రీ లలితాదేవిగా అలంకరించి సహస్ర నామ స్తోత్రములతో కుంకుమార్చన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మనసులోని కోరికలు తీర్చాలని కోరుకున్నారు. మహిళలు లలితా సహస్రనామ స్తోత్రముతో కుంకుమార్చన నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్