త్రాగునీరు లేక ప్రజల అవస్థలు

63చూసినవారు
త్రాగునీరు లేక ప్రజల అవస్థలు
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని వెన్నాచేడ్ లోని అంబేద్కర్ కాలనీలో తాగునీరు రాక అవస్థలు పడుతున్నామని కాలనీ వాసులు గురువారం తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి సింగిల్ మోటార్ స్టాటర్ షార్ట్ సర్క్యూట్ తో పూర్తిగా కాలిపోయింది. గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని కాలనీ వాసులు అన్నారు. మండల అధికారులు స్పందించి వెంటనే మరమ్మతు చేసి తమ కాలనీ వాసులకు త్రాగునీరు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్