కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆల
దేవరకద్ర మండలం చిన్నరాజమూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త రాఘవులు ఇటీవలే గుండె సంబంధిత ఆపరేషన్ చేపించుకుని చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మాజి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఆదివారం గ్రామానికి చేరుకుని రాఘవులును పరామర్శించడం జరిగింది. అలాగే గ్రామంలో ఇటీవలే సర్జరి పూర్తిచేసుకుని చికిత్స పొందుతున్న కార్యకర్త వెంకటయ్యని పరామర్శించడం జరిగింది. మాజీ వార్డుమెంబర్ ఆంజనేయులు భార్య బాలమణిని పరామర్శించారు.