నిండుకుండలా కోయిల్ సాగర్ ప్రాజెక్టు
దేవరకద్ర నియోజకవర్గం కోయిల్ సాగర్ నీటిమట్టం సోమవారం రాత్రి వరకు 28 అడుగులకు చేరింది. ఆదివారం 27. 6 అడుగుల మేర నీరు ఉండగా ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు ప్రవాహం ఆపివేయడంతో నీటిమట్టం పెరిగిందని ప్రాజెక్ట్ డీఈ గోపాల్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 32. 6 అడుగులు కాగా మరో 4. 6 అడుగుల నీరు చేరితే గేట్లు తెరవనున్నారు. మంగళవారం వర్షాలు ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.