జడ్చర్ల: మార్కెట్ ఛైర్ పర్సన్ గా అశ్విని ప్రమాణ స్వీకారం

72చూసినవారు
జడ్చర్ల: మార్కెట్ ఛైర్ పర్సన్ గా అశ్విని ప్రమాణ స్వీకారం
జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. మార్కెట్ ఛైర్మన్ అశ్విని, వైస్ చైర్మన్ గా శేఖర్ గౌడ్, 18మంది డైరెక్టర్లు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్ రెడ్డి హాజరయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలానగర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్