గద్వాల టౌన్ 18వ వార్డ్ కు చెందిన భీమేశ్వర్ గౌడ్ సతీమణి రాధకు చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి కింద మంజూరైన 20, 000 రూపాయల చెక్కును బుధవారం ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి సతీమణి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్వాల పీఏసీఎస్ చైర్మన్ సుభాన్, కౌన్సిలర్ నరహరి గౌడ్, నాయకులు వంట భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.