మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామంలోని 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులు గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు చెంద్రయ్య, గ్రామపంచాయతీలో గ్రామ సర్పంచ్ చెన్న సరిత జెండాను ఇరువురు ఆవిష్కరించారు. తరువాత దేశం కోసం పోరాడి అమరులైన స్వాతంత్ర సమరయోధులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామప్రజలు, యువత వార్డ్ మెంబర్స్, గ్రామ సెక్రెటరి రమేష్, గ్రామ రెవెన్యూ అధికారి, తదితరులు పాల్గొన్నారు.