వాడియాల భూ కబ్జాపై విచారణ చేయండి : ఎమ్మెల్యే

73చూసినవారు
వాడియాల భూ కబ్జాపై విచారణ చేయండి : ఎమ్మెల్యే
జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్ మండలం వడియాల గ్రామానికి చెందిన బిస్మిల్లా బి అనే వృద్ధురాలికి సంబంధించిన భూమి అన్యాక్రాంతంపై వచ్చిన ఫిర్యాదుపై వెంటనే విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని మండల తహశీల్దారు బుధవారం జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జడ్చర్ల నియోజకవర్గంలో భూ కబ్జాలకు అక్రమాలకు తావు లేదని, అటువంటి వారిని ఉపేక్షించమని ఎమ్మెల్యే హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్