మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం వికారాబాద్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ అధికారిక ఛాంబర్ లో కలెక్టర్ ప్రతీక్ జైన్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా కొడంగల్ నియోజకవర్గం లగచర్ల ఘటనపై ఆరా తీశారు. లగచర్లలో జరిగిన దాడిపై కలెక్టర్ ప్రతీక్ జైన్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపి అరుణతో పాటు బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.