లక్ష సభ్యత్వాలు నమోదు చేయాలి : డీకే అరుణ

59చూసినవారు
లక్ష సభ్యత్వాలు నమోదు చేయాలి : డీకే అరుణ
జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష బిజెపి సభ్యత్వాలు నమోదు చేయాలని సోమవారం మహబూబ్ నగర్ ఎంపీ, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రతి బిజెపి కార్యకర్త 100 సభ్యత్వాలు నమోదు చేయాలని లక్ష్యంతో పని చేయాలన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలానగర్, రాజాపూర్, నవాబుపేట, మండలాల బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్