మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నేడు, రేపు, ఎల్లుండి నిర్వహించ తలపెట్టిన రైతు పండుగ సంబరాలకు గురువారం జిల్లా కేంద్రం ముస్తాబయింది. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభకు 30న సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే సదస్సులో 150 వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు.