Sep 19, 2024, 01:09 IST/
తిరుమల లడ్డూ మీద చంద్రబాబు హాట్ కామెంట్స్!
Sep 19, 2024, 01:09 IST
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం మీద సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఎన్డీయే శాసన సభా పక్ష సమావేశంలో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఇన్నీ అన్నీ కావు అని చెప్పారు. ఈ క్రమంలోనే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ కోసం నెయ్యి కాకుండా నాసిరకం పదార్ధాలు ఉపయోగించారు అని బాబు ఫైర్ అయ్యారు. ఆఖరుకు జంతువుల కొవ్వు కూడా లడ్డూ ప్రసాదంలో వాడారని బాబు బాంబు లాంటి వార్తనే పేల్చారు.