Sep 18, 2024, 02:09 IST/వనపర్తి
వనపర్తి
సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం సంతోషకరం: మల్లు రవి
Sep 18, 2024, 02:09 IST
వనపర్తి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతంతోపాటు ఎంపీ మల్లు రవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లు రవి మాట్లాడుతూ. తెలంగాణ స్వతంత్ర భారతదేశంలో విలీనమైన సెప్టెంబర్ 17 ను తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించుకోవడం సంతోషకరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.