వచ్ఛే నెల అసెంబ్లీ సమావేశాలు..అందుకే!?

5458చూసినవారు
వచ్ఛే నెల అసెంబ్లీ సమావేశాలు..అందుకే!?
మే నెల మూడో వారంలో తెలంగాణా అసెంబ్లీ స‌మావేశాన్ని నిర్వ‌హించాల‌ని తెలంగాణా సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఈ అసెంబ్లీ నాలుగురోజుల పాటు జరిగే అవకాశం ఉందని, కొత్త రెవెన్యూ, మున్సిపల్ బిల్లులను చట్టం రూపంలోకి తీసుకొచ్చేందుకే సమావేశం ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సమావేశాలు జడ్పీటీసీ, ఎంపీటీసి ఎన్నికలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు. కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టం రూపొందిస్తుండటంతో సీఎం కేసీఆర్ అధికారులతో భేటీ అయ్యారు. ఇప్పటి వరకు రెవెన్యూ, మున్సిపల్ చట్టాలు ఏ రకంగా ఉన్నాయన్న దానిపై సమీక్షించారు. రెవెన్యూపై 34 రకాల చట్టాలున్నాయని గుర్తించిన సీఎం వీటన్నింటినీ అధ్యయనం చేసి మార్పులు, చేర్పులు చేసి కొత్తగా బిల్లును రూపొందించనున్నారు. మున్సిపల్ అధికారాలకు కత్తెర వేసి జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని భావిస్తున్నారు. కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం పొందిన తర్వాత జూన్ రెండో వారంలోగా మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్