వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురం పాండురంగ స్వామిని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నీలం మధు ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.