బిజినేపల్లి మండలం మహాదేవునిపేట గ్రామంలో ఆదివారం పట్ట పగలే అన్నదమ్ములు పొలమోని బాలస్వామి, పెద్ద మార్కొండయ్యలకు చెందిన రెండు ఇండ్ల తలుపులు, బీరువాలు పగలగొట్టి ఐదున్నర తులాల బంగారం, 12 తులాల వెండి గొలుసులు. రూ. 35 వేల నగదును గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ కె. శ్రీనివాస్ క్లూస్ టీం రప్పించి ఫింగర్ ప్రింట్స్ సేకరించి కేసు నమోదు చేసిన్నట్లు తెలిపారు.