స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని యువజన ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నారాయణపేట పట్టణంలోని మున్సిపల్ పార్కు వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువతీ యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ.. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఒకరి రక్తదానం ఎంతోమంది ప్రాణాలు కాపాడుతుందని అన్నారు.