నారాయణపేట ఎస్పీ కార్యాలయ ఆవరణలో ప్రతిష్టాపన చేసిన మట్టి వినాయకుడిని మంగళవారం సాయంత్రం పోలీస్ సిబ్బంది నిమజ్జనానికి తరలించారు. ఎస్పీ యోగేష్ గౌతమ్, వినాయక ఉత్సవ సమితి సభ్యులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి నిమజ్జనానికి తరలించారు. ప్రధాన రహదారి గుండా ఊరేగింపు నిర్వహించి పట్టణ శివారులోని కొండారెడ్డి పల్లి చెరువు వద్ద పూజలు చేసి నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.