ముస్లిం మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారి అన్నారు. గురువారం నారాయణపేట జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చైర్మన్ కు మర్యాదపూర్వకముగా కలిసి పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముస్లిం మైనారిటీ సంక్షేమంపై సమీక్ష నిర్వహించి మైనారిటీ రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ కళాశాలను తనిఖీ చేశారు.