చేప గుడ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. దీంతో గుండె సంబంధిత సమస్యలు కూడా దరిచేరవని నిపుణులు చెబుతున్నారు. మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా చేప గుడ్లు బాగా ఉపయోగపడతాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మెదడు పనితీరు, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేప గుడ్లు తీసుకుంటే జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.