నారాయణపేట: ధర్నాను విజయవంతం చేయాలి

70చూసినవారు
నారాయణపేట: ధర్నాను విజయవంతం చేయాలి
అన్ని రకాల పంటలకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 30న జిల్లాలో వున్న తహసీల్దార్ కార్యాలయాల ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయాలని ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి యాదగిరి అన్నారు. ధర్నాను జయప్రదం చేయాలని మంగళవారం నారాయణపేట మండలం కోటకొండ గ్రామంలో రైతులకు కర పత్రాలను అందజేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు పంటలకు మద్దతు ధరలు పెంచాలని అన్నారు. అన్ని రకాల వరి ధాన్యానికి బోనస్ చెల్లించాలన్నారు.

సంబంధిత పోస్ట్