చిన్నపిల్లల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

63చూసినవారు
చిన్నపిల్లల ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
సకాలంలో విధులకు హాజరై చిన్నపిల్లలకు వైద్యం అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ వైద్యులను ఆదేశించారు. గురువారం నారాయణపేటలోని చిన్నపిల్లల ఆసుపత్రిని జిల్లా ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీ సమయంలో విధులు నిర్వహించే డాక్టర్ లేకపోవడం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో హాజరై సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రి ఆవరణ అపరిశుభ్రంగా ఉండడం చూసి శుభ్రంగా ఉంచాలని సిబ్బందికి తగు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్