జిల్లాలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ అన్నారు. నారాయణపేట పట్టణంలోని శీల ఫంక్షన్ హాలులో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేశారు. కార్యక్రమానికి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ గురునాథ్ రెడ్డి, ఎమ్మెల్యేలు పర్ణిక రెడ్డి, శ్రీహరి పాల్గొన్నారు.