కనిమెట్టలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

63చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్టలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాణి పరమేష్, శ్రీనివాస్ రెడ్డి, రామచంద్ర యాదవ్, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్