వనపర్తి జిల్లా ప్రజావాణి ఫిర్యాదులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చే ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ ఆదేశించారు. సోమవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం. నగేష్ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయంలో ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు ప్రజావాణిలో మొత్తం 55 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.