ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ దే: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

62చూసినవారు
ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ దే: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 లక్షల మందిని వలస పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బుధవారం మంత్రులు, ఎమ్మెల్యేలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సందర్శన నేపథ్యంలో పేర్కొన్నారు. ఆంధ్ర రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసి పాలమూరును ఎడారిగా మార్చారని పేర్కొన్నారు. ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీదన్నారు.

సంబంధిత పోస్ట్