వనపర్తి: రాజరాజేశ్వరీ దేవిగా జ్ఞానాంబిక అమ్మవారు దర్శనం

58చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లి శ్రీకోటి లింగేశ్వర దత్త దేవస్థానములో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరాయి. చివరి రోజు శనివారం జ్ఞానాంబిక దేవి అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి సంకల్ప పూజలతో శ్రీ చక్రానికి అభిషేకం చేశారు. అనంతరం లలితా సహస్రనామ స్తోత్రముతో భక్తులు కుంకుమార్చనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్