వనపర్తి: కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించాలి: సీఐటీయూ

63చూసినవారు
మున్సిపల్ కార్మికుల వేతనాలు సకాలంలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు వనపర్తి మున్సిపల్ ఆఫీస్ ముందు నిరసన చేపట్టారు. సీఐటీయూ నేత ఆంజనేయులు మాట్లాడుతూ.. కార్మికులకు ప్రతినెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలన్నారు. కార్మికులను విభజించి పాలించే విధానాన్ని అధికారులు విడనాడాలన్నారు. కార్మికుల అకౌంట్లో వేతనాల డబ్బులు జమచేస్తున్నట్లు కమిషనర్ హామీ ఇవ్వడంతో కార్మికులు నిరసన విరమించారు.

సంబంధిత పోస్ట్