జార్ఖండ్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రైళ్లు నడిచే నది బ్రిడ్జిపై ఓ వ్యక్తి వీడియో కోసం బైకును నడిపాడు. బైకుపై వెళ్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. బైకుపై చిన్న పిల్లాడితో సహా ఇద్దరు ఉన్నారు. ఇలా ప్రాణాలకు తెగించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి పనుల వల్ల రైలులోని వందలాది ప్రయాణికులకూ ప్రమాదమేనని మరికొందరు ఫైర్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.