AP: కడప జిల్లాలోని తొండూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్కడి తేలూరు తుమ్మలపల్లె గ్రామంలో చిన్న వివాదం కారణంగా ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెను కొడవలితో నరికి చంపాడు. అనంతరం పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతులను తుమ్మల శ్రీలక్ష్మి (37), తుమ్మల గంగోత్రి(14)గా అధికారులు గుర్తించారు. నిందితుడు గంగాధర్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.