కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. భారీ వేగంతో వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో హాయిగా పడుకున్నాడు. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.