ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ కాసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మంత్రి జూపల్లి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలోని ఐసీఏఆర్-కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించి అక్కడే సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న 500 మంది రైతులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు.