Oct 25, 2024, 15:10 IST/మంచిర్యాల
మంచిర్యాల
సింగరేణి విస్తరణకు కార్మిక సంఘాల సహకారం అవసరం
Oct 25, 2024, 15:10 IST
సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదలతో పాటు వ్యాపార విస్తరణ చర్యలకు కార్మిక సంఘాల సహకారం ఎంతో అవసరమని సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం జరిగిన గుర్తింపు, ప్రాతినిథ్య కార్మిక నాయకుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు పూర్తి పని గంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించేలా చూడడంలో కార్మిక సంఘాలు కూడా తోడ్పాటు అందించాలన్నారు.