గంజాయి మొక్కలు సాగు చేస్తున్న యువకుడిని అరెస్టు చేసినట్లు తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు. తంగళ్లపల్లి కి చెందిన ఇంటి పెరటిలో గంజాయి సాగు చేస్తున్నాడనే సమాచారం మేరకు అక్కడ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో రూ. 40 వేలు విలువచేసే నాలుగు గంజాయి మొక్కలను గుర్తించినట్లు ఎస్సై వెల్లడించారు. గణేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.