బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలను ఎమ్మెల్యే గడ్డం వినోద్ తనిఖీ చేశారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. మైదానం చదును కోసం మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ తో ఫోన్లో ఎమ్మెల్యే మాట్లాడారు. మైదానాన్ని చదును చేయాలని కోరారు. విద్యార్థులంతా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. చదువులోనూ క్రీడల్లోను రాణించాలన్నారు.