నెన్నెల మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద ఆదివారం మాజీ సర్పంచ్ తోట సుజాత శ్రీనివాస్ దంపతులు చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రారంభించారు. శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ చేయలనే సంకల్పంతో వేసవి కాలంలో ప్రయాణికులకు, పాదచారులు, కూలీలు నీటి దప్పిక కోసం ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు వహించి చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.