బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి జీఎం కార్యాలయం ఆవరణలో మంగళవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఏరియా జిఎం ఎంశ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత విలువలు గల ప్రజా జీవన విదానం, ప్రజాస్వామ్య దేశంగా మంచి పేరు రావడానికి కారణం మన రాజ్యాంగమే అని అన్నారు. ప్రతి వ్యక్తి దేశాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు.