మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 గనిని ఏరియా నూతన జిఎం దేవేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు జిఎం కు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు. గని కార్యాలయంలో పలు మ్యాపులు, ప్లాన్లను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ రోజువారిగా సాధిస్తున్న ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని, ఎల్లప్పుడూ రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని అధికారులకు ఆయన సూచించారు.