Sep 11, 2024, 10:09 IST/
ఢిల్లీ లిక్కర్ స్కాం.. అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి బెయిల్
Sep 11, 2024, 10:09 IST
ఢిల్లీ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరుణ్ రామచంద్రన్ పిళ్లైకి ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అరుణ్ రామచంద్రన్ పిళ్లై హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త. పిళ్లై… బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సన్నిహితుడని, లిక్కర్ స్కాంలో కవిత ప్రయోజనాల కోసం పిళ్లై పనిచేశాడని.. ఇండోస్పిరిట్ లిక్కర్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి లంచాలు స్వీకరించి, ఆ లంచాలను ఈ కేసులో ఇతర నిందితులకు అందించాడన్నది అతడిపై ఉన్న ప్రధాన అభియోగం.