కెనడాలో చదువుకోవాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం మరోసారి షాక్ ఇచ్చింది. ఈ సంవత్సరం మొదటి అర్ధభాగంలో భారత్ నుండి స్టడీ పర్మిట్ల ఆమోదాలు సగానికి తగ్గాయని అక్కడి నివేదికలు వెల్లడించాయి. 2023లో ఆమోదించబడిన విదేశీ విద్యార్థుల స్టడీ వీసాల సంఖ్య 4,36,000గా ఉంది. కానీ, 2024లో ఇప్పటివరకు కేవలం 2,31,000గా ఉందని నివేదిక తెలిపింది. 2018, 2019లో వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.