జైపూర్: రూ. 50 వేల విలువైన మద్యం స్వాధీనం

69చూసినవారు
జైపూర్: రూ. 50 వేల విలువైన మద్యం స్వాధీనం
జైపూర్ మండలం కుందారం గ్రామంలో బహిరంగ వేలం ద్వారా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులపై ఎక్సైజ్ సిబ్బంది దాడులు చేసినట్లు ఎక్సైజ్ సీఐ గురవయ్య తెలిపారు. గ్రామంలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారని గ్రామస్తుల ఫిర్యాదు మేరకు బోయినపల్లి సునీల్, దండవేణి రాజశేఖర్ ల దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. విలువైన మద్యం స్వాధీనం చేసుకొని నిందితులను తహశీల్దార్ వనజా రెడ్డి ఎదుట సోమవారం బైండోవర్ చేశామన్నారు.

సంబంధిత పోస్ట్