ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం..!

68చూసినవారు
ఘనంగా ప్రపంచ వృద్ధుల దినోత్సవం..!
రామకృష్ణపూర్ పట్టణంలో టీబీఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు రాజలింగు మోతె ఆధ్వర్యంలో ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ సంక్షేమానికి సర్వశక్తులు ధారపోసి తుది దశలో వృద్ధులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని, కొడుకులు, కూతుర్లు వారిని సరిగ్గా పట్టించుకోవడంలేదని, వృద్దులపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రభుత్వాలు వృద్ధుల సంక్షేమం, భద్రత కల్పించాలన కోరారు.

సంబంధిత పోస్ట్