పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయమూర్తి

51చూసినవారు
పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన న్యాయమూర్తి
కాసిపేట మండలంలోని కేజిబీవీ, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలను శుక్రవారం బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జీ జె. ముఖేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. లీగల్ సెల్ అథారిటీ సభ్యులతో కలిసి విద్యార్థినుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన భోజనం అందించడం లేదని విద్యార్థినిలు జడ్జీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో భోజన సదుపాయాలపై పాఠశాలల ఎస్ఓలకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదువుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్